ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వచ్చే నెల 1 నుండి ప్రారంభించనున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సమర్థవ ంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు డివిజన్, మండల స్థాయి అధికారులతో జెసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలందరితోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలని, ప్రతి గ్రామంలో పూర్తి సర్వే నిర్వహించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించాలని చెప్పారు. మరుగుదొడ్లు నిర్వహణ, వైద్య సదుపాయాల కల్పన, టెస్టింగ్ కిట్లు, విద్యుత్ సరఫరా తదితర అంశాలను తప్పకుండా పరీక్షించాలన్నారు. ఆశా వర్కర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఈ- ఆఫీస్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలన్నారు. స్వమిత్వ, ప్రధానమంత్రి కిసాన్ ల్యాండ్ లింకేజీ కార్యక్రమాన్ని మరింత పురోగతిలోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.










