ప్రజాశక్తి - మక్కువ : జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు వరం లాంటిదని డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర అన్నారు. మంగళవారం మక్కువలో 1,2 సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు 1400 ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన 11 రకాల ధ్రువపత్రాలు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ప్రజల ఇంటిముందుకే అందించే కార్యక్రమం జగనన్న సురక్ష అని అన్నారు. మండలంలోని నాలుగేళ్లలో రూ.20కోట్లకు పైగా 13 వేల మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. కొత్తగా ఇల్లు కట్టాలనుకుని నియోజకవర్గంలో 2300 ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు, వైసిపి మండలశాఖ అధ్యక్షులు మావుడి రంగునాయుడు, తహశీల్దార్ ఆవాల సూర్యనారాయణ, ఎంపిడిఒ సూర్యనారాయణ పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : మండలంలో జనగనన్న సురక్ష కార్యక్రమంలో సంఘం వలస, గంగాపురం సచివాలయాల్లో కొనసాగింది. సంగంవలసలో జరిగిన సురక్ష క్యాంపు కార్యక్రమానికి ఎంపిడిఒ ఎస్.రమేష్ అధ్యక్షత వహించారు. గ్రామంలోని పలువురు దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు రేషన్ కార్డులు అందించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్, మ్యుటేషన్‌పై దరఖాస్తులు స్వీకరించి త్వరలోనే విచారణ జరిపి వారికి సంబంధిత పత్రాలు మంజూరు చేస్తామని తెలిపారు. గంగాపురం సచివాలయం పరిధిలో జరిగిన కార్యక్రమానికి తహశీల్దార్ శివన్నారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శోభారాణి, ఆత్మ చైర్మన్ ఎండ్రాపు తిరుపతిరావు, సంఘంవలస, కవిటిభద్ర, గంగాపురం సర్పంచులు బడే చిట్టి నాయుడు, వై.ఉషారాణి, ఎస్.లక్ష్మి, సూర్యనారాయణ పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : అర్హులుగా ఉండి సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి ప్రతి ఒక్కరికీ అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రాయగడ జమ్ము సర్పంచి పత్తిక అమల కోరారు. మండలంలోని రాయగడ జమ్ములో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలందరికీ అందుతున్నాయా లేదా అనేది తహశీల్దార్ జె.రాములమ్మ అడిగి తెలుసుకున్నారు. అర్హులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి జగదీష్‌కుమార్, ఎపిఒ శివరామకృష్ణ, ఎంపిటిసి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వాసుదేవరావు, వైసిపి నాయకులు పత్తిక బిసు, పాల్గొన్నారు.
పాలకొండ: మండలంలోని గొట్టమంగళాపురంలో జగన్నన సురక్ష కార్యక్రమం తహశీల్దార్ సోమేశ్వరరావు ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గహ పాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ డొంక త్రినాధులు, సర్పంచ్ ఎన్ని బాబ్జీ నాయుడు తదితరులు ఉన్నారు.
సీతానగరం : మండలంలోని నిడగల్లు, పెద్దఅంకలంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి బి.రమణమ్మ 11 రకాల సేవలు ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఎం.బాబ్జీ, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్ ప్రసాద్, ఇఒపిఆర్‌డి కెకె వర్మ, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వివిధ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వీరఘట్టం : జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారమని సర్పంచి కె.వెంకటరమణ గ్రామస్తులకు సూచించారు. మండలంలోని తూడిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమస్యలున్న సత్వరమే పరిష్కరించుకోవాలని ఆయన ప్రజలు కోరారు. అలాగే బిటివాడలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్జీదారులకు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పివిఆర్ పురం, బిటివాడ సర్పంచులు ఉదయాన జగన్మోహన్రావు, ఎస్.నరసింహులు, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, ఎంపిడిఒ జి.జయంతి ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు పి.విజయకుమారి, ఇఒపిఆర్‌డి వి.రామచంద్రరావు, ఆర్‌ఐ ఎస్.మారుతీరావు, సచివాలయ కార్యదర్శులు ఎ.చిన్నారావు, దుర్గారావు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
పాచిపెంట : మండలంలోని కోటికిపెంటలో సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకంతో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం 11 రకాల ధ్రువ పత్రాలు ఉచితంగా అందిస్తుందన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు దండి ఏడుకొండలు, సీనియర్ అసిస్టెంట్ ఉదరు కుమార్, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.










