ప్రజాశక్తి - ఆస్పరి
'జగనన్న ఆరోగ్య సురక్ష' ప్రజల ఆరోగ్యానికి రక్ష అని సర్పంచి శంకరమ్మ తెలిపారు. శుక్రవారం మండలంలోని తంగరడోణ గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'ఆరోగ్య సురక్ష'ను చేపట్టారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ... తంగరడోణ గ్రామంలో 554 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు. స్పెషలిస్టులు కల్పన, శశి కిరణ్, డాక్టర్లు మాధవి లత, టిడిపి ఎంపిటిసి నరసప్ప, వైస్ సర్పంచి తిక్కయ్య, విఆర్‌ఒ రామాంజినేయులు, సచివాలయ కన్వీనర్లు రాజన్న, పాండు, నరసన్న, నల్లన్న, మునిస్వామి, ఓబులేసు, రంగన్న పాల్గొన్నారు. పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. సర్పంచి మల్లమ్మ, ఉప సర్పంచి హుసేని, వైసిపి నాయకులు ఆంజనేయులు మాట్లాడారు. 9 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పిఎస్‌లు లక్ష్మీ, మహేంద్ర పాల్గొన్నారు.










