
ప్రజాశక్తి - చింతలపూడి
'జగనన్న సురక్ష' పేదలకు వరమని చింతలపూడి వైసిపి నగర పంచాయతీ అధ్యక్షులు కొప్పుల నాగు తెలిపారు. నగర పంచాయతీ కమిషనర్ ఎన్.రాంబాబు ఆధ్వర్యంలో బోయగూడెం సచివాలయం పరిధిలో చింతలపూడి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠాశాల వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత పరీక్షలు, వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తున్నారని, అందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ స్టాల్ పరిశీలించారు. మండల సిడిపిఒ మాధవి పోష్టికాహారం, బాలమృతం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిటీ మెడికల్ దుర్గారావు, త్సల్లాబత్తుల శ్రీను, రాజ్ ప్రకాష్, గంథం చంటి, ఆత్కూరి సుబ్బారావు పాల్గొన్నారు.