జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 రకాల సర్వీసులు
డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి
ప్రజాశక్తి-డోన్
జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 రకాల సర్వీసులు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం డోన్ మండలం లోని దొర పల్లె గ్రామం లో గ్రామ సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు డోన్ వైస్ ఎంపీపీ సుభద్ర ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ ఎంపీపీ కమలాపురం రేగటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు,డోన్ జెడ్పీటీసీ రాజ్ కుమార్, డోన్ మాజీ మార్కేట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు లు హాజరయ్యారు.ఈ సంధర్బంగా ఎంపీపీ రేగటి రాజాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సురక్ష ప్రోగ్రామ్ కింద 15004 గ్రామ,వార్డు సచివాలయాల్లో నెలరోజులపాటు కొనసాగుతుందన్నారు.రాష్ట్రంలో 90 శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి ఉందని సాంకేతిక కారణాల, మరే ఇతర కారణాలవల్లో ఆ ఒక్క శాతం మందికూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో అర్హులకు పథకాలు మంజూరు చేస్తారని, వివిధ సర్టిఫికెట్లు జగనన్న సురక్షా కార్యక్రమంలో జారీ చేయడం జరుగుతుందన్నారు. కుల, నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్లతో పాటు ఆదాయ ధ్రువీకరణ, డేట్ ఆఫ్ బర్త్, మరణ ధ్రువీకరణ, మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్, మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ), కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన, వంటి 11 సర్వీసులు ఈ క్యాంపులలో ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.పొరపాటున ఎక్కడైనా,ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే వారికి కూడా మంచి చేసే కార్యక్రమే జగనన్నా సురక్షా కార్యక్రమమని తెలిపారు.ఈ కార్యక్రమంలో డోన్ తాహసిల్దార్ విద్యాసాగర్,,డోన్ డిప్యూటీ తాహసిల్దార్ మధు,ఈవోఆర్డి వరప్రసాద్ రావు,సీనియర్ అసిస్టెంట్ సుదీర్ తదితరులు పాల్గొన్నారు.










