Jul 04,2023 16:43

సర్టిపికెట్‌లను అందజేస్తున్న ఎంపిపి,అధికారులు

జగనన్న సురక్ష కార్యక్రమం కొత్త అధ్యాయానికి శ్రీకారం
చాగలమర్రి :
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సిఎం జగన్మోహన్‌రెడ్డి అందుబాటులోకి తీసుకొచ్చారని ఎంపిపి రామిశెట్టి వీరభద్రుడు తెలిపారు. చాగలమర్రి పట్టణంలోని 3వ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్‌ తులసమ్మ అధ్యక్షతన మంగళవారం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ సచివాలయ పరిధిలో 11 రకాల సేవలను ఉచితంగా ప్రజలకు అందించే వెసులుబాటును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 328 ధరఖాస్తుదారులకు వివిధ రకాల సర్టిపికెట్లను పంపిణి చేసారు. ఈకార్యక్రమం లో వైస్‌ ఎంపిపి రఫి, తహసీల్దారు సుభద్రమ్మ,ఎంపీడీవో మహబూబ్‌ దౌలా,డిటి విజరు కుమార్‌,ఈఓఆర్‌డి సుదర్శన్‌ రావు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 3,4వ సచివాలయం పరిధిలోని కె.వి.ఆర్‌ గార్డెన్స్‌ నందు కమిషనర్‌ పి.కిషోర్‌, మేనేజర్‌ మంజునాథ గౌడ్‌,ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌ రెడ్డి, సచివాలయ జె.సి.యస్‌ కన్వినర్‌ అబూబక్కర్‌, కౌన్సిలర్‌లు పి.చాంద్‌ బాష, బోయ జయమ్మ, షేక్‌ రేష్మా నాయబ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ అర్జీ దారులకు ఉచితంగా సర్టిఫికెట్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ లు పి.చాంద్‌ బాష, బోయ జయమ్మ, షేక్‌ రేష్మా, షేక్‌ నాయబ్‌, ఉమ్మడి జిల్లాల మైనారిటీ జోనల్‌ ఇంచార్జ్‌, జె.సి.యస్‌ కన్వీనర్‌ అబూబక్కర్‌, తదితరులు పాల్గొన్నారు.