
ఖాళీగా ఉన్న కుర్చీలు
ప్రజాశక్తి-కోటవురట్ల:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న సురక్ష కేంద్రాలు వెల వెలబోతూ దర్శనమిచ్చింది. బుధవారం మండలంలోని కొడవటిపూడి గ్రామంలో తహసిల్దార్ జానకమ్మ, బికే పల్లి గ్రామంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బికేపల్లి సర్పంచ్ లింగన్న నాయుడు ఆదాయ, కుల ధ్రువపత్రాలు మినహా ఏ విధమైన సేవలు పరిపూర్ణంగా అందలేదన్నారు. బికేపల్లి గ్రామంలో అధికారులు, వాలంటీర్లు మినహా ప్రజలెవ్వరూ హాజరు కాకపోవడంతో సురక్ష గ్రామ సభ వెలవెల పోయింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సోమశేఖర్, బికే పల్లి ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు,