ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 'జగనన్న సురక్ష' కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలతో మమేకం కావాలని మండల ప్రత్యేకాధికారి, సర్వశిక్ష అభియాన్ కె.వేణుగోపాల్, తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ కొండయ్య తెలిపారు. శనివారం రామదుర్గం, నగరడోనా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సిసింద్రీ, నాగభూషణం ఆధ్వర్యంలో 'జగనన్న సురక్ష' నిర్వహించారు. ప్రత్యేకాధికారి వేణుగోపాల్, మండల అధికారులంతా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలుంటే తెలపాలని కోరారు. గ్రామ వాలంటీర్లకు 'జగనన్న సురక్ష'పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామానికీ తహశీల్దార్ ఒక బృందం, ఎంపిడిఒ ఒక బృందం ఏర్పడి 'జగనన్న సురక్ష'పై వెళ్తున్నారని తెలిపారు. విఆర్‌ఒలు మల్లికార్జున, కిష్టప్ప పాల్గొన్నారు.
రామదుర్గం, నగరడోనాలో 'జగనన్న సురక్ష'లో పాల్గొన్న అధికారులు










