Jul 19,2023 18:13

ప్రజాశక్తి - టి.నరసాపురం
         జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వైసిపి జిల్లా రైతుసంఘం అధ్యక్షులు వాసిరెడ్డి మధు అన్నారు. మండలంలోని తెడ్లెం గ్రామ సచివాలయం వద్ద బుధవారం సర్పంచి స్రవంతి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మధు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సురక్ష కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బండి సుబ్బారావు, ఎస్‌విపికెహెచ్‌ శ్రీనురాజు, ఎంపిడిఒ మంగాకుమారి పాల్గొన్నారు.