Dec 13,2022 00:00

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, జెసి తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
చోడవరం నియోజకవర్గం పరిధి అడ్డూరులో నిర్మించనున్న జగనన్న స్మార్ట్‌ సిటీకి సంబంధించిన బ్రోచర్‌ను స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి ఆవిష్కరించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎంఐజి లేఅవుట్‌ డిటిసిపి ఎంఐజి ఆన్లైన్‌ వెబ్‌ సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లేఅవుట్‌లో 165 ప్లాట్లు ఉంటాయన్నారు. వాటిలో పది శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, ఐదు శాతం ప్రభుత్వ పెన్షనర్లకు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్‌డిఎ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర, జెసి కల్పనా కుమారి, డిఆర్‌ఓ వెంకటరమణ, ఏపీవోలు మౌనిక, వైవి రమణ, ప్రణాళిక అధికారి శిల్ప తదితరులు పాల్గొన్నారు.