Jul 14,2023 19:16

ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్న నారాయణ, సర్పంచులు, అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్న అనేక సంక్షేమ పథకాల వల్ల అన్ని తరగతుల వారు కూడా వంద శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ తెలిపారు. శుక్రవారం గుమ్మనూరు సచివాలయ కార్యాలయంలో గుమ్మనూరు సర్పంచి లక్ష్మీదేవి, కాజీపురం సర్పంచి రమాదేవి అధ్యక్షతన తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ కొండయ్య, పంచాయతీ కార్యదర్శి సురేంద్ర ఆధ్వర్యంలో 'జగనన్న సురక్ష' నిర్వహించారు. గ్రామ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి సమస్యలను తెలుసుకొని ఆ దరఖాస్తులకు అధికారుల ద్వారా పరిష్కారం చూపించిన ధ్రువీకరణ పత్రాలను మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనురు నారాయణ, సర్పంచుల చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేద్దామన్నారు. డిటి గుండాల నాయక్‌, పంచాయతీ కార్యదర్శి జయరాం నాయక్‌, విఆర్‌ఒ రంగన్న, హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ భవ్య పాల్గొన్నారు.