Aug 01,2021 12:34

ప్రజాశక్తి-చందర్లపాడు : జగనన్న పట్టా ఇచ్చారు. ప్లాటు కేటాయించలేదు. కనీసం ప్లాటు నెంబర్ ఇవ్వకుండా లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే....  చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఒక నిరుపేద దళిత మహిళ  అయిన కోండ్రు విజయకు ఇళ్ళ పట్టా ఇచ్చారు. కాని స్థలం చూపించకుండా అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు. కనీసం ప్లాటు నెంబరు కేటాయించలేదు. గ్రామంలో సుమారు రెండు వందలకు పైగా లబ్ధిదారులకు జగనన్న ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చారు. అందరికీ పట్టాలు ఇచ్చి పోజిషన్ చూపించారు. స్థలాలు హద్దులు కూడా ఇచ్చారు. వారికి ప్లాటు నెంబర్లు కూడా ఇచ్చారు. కాని కోండ్రు విజయకు ఇచ్చిన పట్టాలో సదరు జగనన్న కాలనిలో స్థలం ఎక్కడ ఇచ్చారో, పట్టాలో మాత్రం వేరే స్థలం వారి హద్దులు చూపించారు. కనీసం విజయకు జగనన్న లేవుట్లో స్థలం చూపించకుండా, కనీసం ప్లాటు నెంబరు చెప్పకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. కోండ్రు విజయ నిరుపేద మహిళ. ఆమె పేరు మీదగాని, భర్త నాగేశ్వరరావు పేరు మీద సెంటు స్థలం లేదు. పోలం లేదు. విజయ  రెక్కాడితే డొక్కాడని కుటుంబం రోజు వారి కూలీ పనులు జీవనం సాగిస్తున్నారు. విజయకు స్వంత ఇళ్ళు లేకపోవడంతో తన బంధువుల స్థలంలో తాటాకులు కట్టుకుని నివాసం వుంటున్నది. తాటాకులు వున్న స్థలంకు పట్టా ఇచ్చినట్టుగా పక్కంటి వారి పేర్లు హద్దులు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబేనా గ్రామస్థులు ముక్కన వేలేసుకుంటున్నారు. అధికారులు మాముళ్ళకు కక్కుర్తి పడి గ్రామంలో ఎంతో మంది ధనవంతులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినట్టు ఆరోపణలు వ్యక్తం ఆవుతున్నాయి.  అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే అధికారులు పట్టాలు ఇస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ముప్పాళ్ళ గ్రామంలో ఇళ్ళు పట్టాలపై విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. కోండ్రు విజయకు ఇచ్చిన జగనన్న పట్టాలో లేవుట్లో ప్రభుత్వం పక్కా స్థలం కేటాయించి ప్లాటు నెంబరు కేటాయించాలని కుటుంబ సభ్యులు ముక్తకంఠంతో కోరుతున్నారు.