Sep 01,2023 00:30

మంజూరు పత్రాన్ని ఇస్తున్న ఎంపిపి

ప్రజాశక్తి-గొలుగొండ:ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెళ్లి కానుకగా ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, బిసి, మైనారిటీలకు 50 వేల చొప్పున అందజేస్తున్నారని వైస్‌ ఎంపీపీ జక్కు నాగమణి అన్నారు. ఈ మేరకు మండలంలోని జోగుంపేటలో ఇటీవల వివాహం చేసుకున్న వధువుల కుటుంబాలకు జగనన్న పెళ్ళికానుకను అందించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపిపి మాట్లాడుతూ, ఈ జగనన్న పెళ్ళికానుకతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి అధికార ప్రతినిధి జక్కు అప్పలస్వామి నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పంచాడ నాగరాజు, కళ్లింపుడి శ్రీను, కుపరాల నర్సింగరావు, పారుపల్లి జమీలు, వీఆర్వో గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.