'జగనన్న పాలవెల్లువ' సర్వే చేపట్టండి: జెసి
ప్రజాశక్తి- చిత్తూరు : జగనన్న పాలవెల్లువ ఇంటింటా పాడి రైతుల ఇంటింటా సర్వే వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం డిఆర్‌ఓ యన్.రాజశేఖర్‌తో కలసి జగనన్న పాల వెల్లువ, జగనన్నకు చెబుదాం, అసైన్మెంట్ ల్యాండ్, రీసర్వే,22 ఏ, జగనన్నకు చెబుదాం, మీసేవ, ఏపీ సేవలపై జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో జగనన్న పాల వెల్లువకు సంబంధించి రెండో విడతలో 11 మండలలలోని గ్రామాలలో పాడి రైతులకు సంబంధించి ఇంటింటా సర్వే పై తహశీల్దార్లు, ఎంపిడిఓలు ప్రత్యేక దష్టి పెట్టి రెండు రోజులలోగా సర్వేని పూర్తి చేయాలన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న గ్రౌండ్ ట్రూథింగ్ (జిటి) సర్వేని వెంటనే పూర్తిచేయాలని, పెద్దపంజాని, బైరెడ్డిపల్లి, వి.కోట, గంగవరం, గుడుపల్లి మండలాలకు సంబంధించి సోమవారం కల్లా పూర్తి చేయాలని తెలిపారు. అలాగే సర్వే పూర్తి అయిన మండలంలోని సర్వేయర్లును మిగిలిన మండలాలకు పంపించి రెండు రోజులలో పూర్తిచేయాలని మండల సర్వేయర్లు ను ఆదేశించారు. స్టోన్ ప్లాంటేషన్ వందశాతం పూర్తి చేయాలని, ప్రభుత్వ భూములు, రీసర్వే అయిన పట్టా భూములకు సంబంధించి విఆర్‌ఓ లాగ్‌ఇన్ నుండి వచ్చిన వెంటనే తహశీల్దార్లు, ఆర్డీఓకు పంపించాలని తహశీల్దార్లను ఆదేశించారు. 22ఏ పూర్తి అయిన ప్రపోజల్స్‌ను కలెక్టర్ కార్యాలయంకు పంపించాలన్నారు. నోటిఫికేషన్ 13కు సంబంధించి 19 గ్రామాలకు సంబంధించి మళ్ళీ ఒకసారి పరిశీలించి సంబంధిత ఆర్డీఓల ద్వారా కలెక్టరేట్‌కు పంపించాలని తహశీల్దార్లను ఆదేశించారు. అసైన్మెంట్ ల్యాండ్ పట్టాలకు సంబంధించి టెక్నీకల్ సమస్యలుంటే వెంటనే పరిస్కారించుకొని పూర్తి చేయాలన్నారు. అనర్హుల ఉన్నారని తెలిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జగనన్నకు చెబుదాంకు సంబంధించి 48 గంటలలోపు రాకుండా చూడాలన్నారు. జగనన్నకు చెబుదాం అర్జీలను ప్రతిరోజు పరిశీలించుకోవాలన్నారు. మీసేవ, ఏపి సేవకు సంబంధించి బియాండ్స్‌లోకి రాకుండా చూడాలని పెండింగ్‌లో ఉన్న వాటిని ఎప్పటికపుడు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జడ్పీ సిఈఓ ఎం.ప్రభాకర్‌రెడ్డి, డిపిఓ లక్ష్మి, పశుసంవర్ధకశాఖ జెడి ప్రభాకర్, డిఎల్‌డిఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.










