Sep 03,2023 00:13

ప్రజాశక్తి - అద్దంకి
మండలంలోని గోవాడ గ్రామంలో జగనన్న పాలవెల్లువ రుణ మేళా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎహెచ్ఓ హనుమంతరావు మాట్లాడుతూ రైతులు కొత్త గేదెలు కొనుగోలుకు, పశుగ్రాసం, పాడి రైతులు, పశు పోషకులకు సలహాలు, సూచనలు చేశారు. జగనన్న పాల విలువ పాల కేంద్రం విశిష్టతను వివరించారు. మహిళా డైరీ సహకార సంఘాలకు రుణాలు, రుణాల విశిష్టతను తెలిపారు. పిడిసిసిబి సిఈఓ జనరల్ మేనేజర్ ప్రసాదరావు మాట్లాడుతూ రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు, రుణం పొందుటకు కావలసిన షరతులను వివరించారు. వెలుగు ఏపీఎం, పిహెచ్ఈజిపి ఇచ్చిన మినీ డైరీ ఫార్మ్ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిసిఓ పి రామారావు, డిఆర్‌డిఏ పిడి అర్జునరావు, ఎంపిడిఒ దేవసేన కుమారి, పశుసంవర్ధక శాఖ ఏడి మోహనరావు, విఏఎస్ బొమ్మనంపాడు, సర్పంచి, సిబ్బంది సొసైటీ పాల్గొన్నారు.