Oct 12,2023 21:41

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ

ప్రజాశక్తి-గోరంట్ల రూరల్‌ : సిఎం జగన్‌ పాలనలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' ద్వారా ప్రజల చెంతకే వైద్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ పేర్కొన్నారు. మండల పరిధిలోని బూదిలి ప్రాథమిక పాఠశాలలో గురువారం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సిఎం జగన్‌ పాలన సాగిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు. పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో కుకూరలు, కూరగాయలు, పౌష్టికాహార పదార్థాలు తినాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు 'జగనన్న ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. శిబిరంలో ప్రతి ఒక్కరికీ మందులు, జగనన్న ఆరోగ్య సురక్ష కిట్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్‌డిఒ భాగ్యరేఖ, గోరంట్ల మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ బూదిలి వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచి ఆంజనేయులు, ఎంపిపి ప్రమీలమూర్తి, జడ్పిటిసి పాలే జయరామ్‌ నాయక్‌, మండల ప్రత్యేకాధికారి విజయకుమార్‌ రెడ్డి, జిల్లా సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ పాటూరి శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో ఛైర్మన్‌ రఘురాంరెడ్డి, అగ్రి అడ్వైజర్‌ కమిటీ ఛైౖర్మన్‌ పోతుల రామకృష్ణారెడ్డి, ఇఒపిఆర్‌డి సుధాకర్‌, ఎంఇఒ గోపాల్‌, డాక్టర్‌ సాయి సుప్రిత పాల్గొన్నారు.
రొద్దం : 'జగనన్న ఆరోగ్య సురక్ష' ప్రజారోగ్యానికి భరోసా అని ఎంపిపి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని ఆర్‌.లోచర్ల సచివాలయం పరిధిలో గురువారం 'జగనన్న ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరం నిర్వశించారు. ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ఆధ్వర్యంలో పోషక పదార్థాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో ఎంపిడిఒ రాబర్ట్‌ విల్సన్‌, తహశీల్దార్‌ అనంతాచారి, ఇఒఆర్‌డి కేశవరెడ్డి, ఎంపిపి చంద్రశేఖర్‌, స్వచ్ఛాంధ్ర స్టేట్‌ డైరెక్టర్‌ బి.నారాయ ణరెడ్డి, పెనుకొండ మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ కలిపి శ్రీనివాసులు, జిల్లా సాంస్కృతిక కన్వీనర్‌ జెట్టి మారుతిరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్‌ ఆర్‌ఎ.రవిశేఖర్‌రెడ్డి, సర్పంచులు గంగాధర్‌, సోమిరెడ్డి పాల్గొన్నారు.
సోమందేపల్లి : మండల పరిధిలోని గుడిపల్లి సచివాలయ పరిధిలో సర్పంచులు గిరిజమ్మ నాగరాజురావు, అంజినాయక్‌, ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం ఆధ్వర్యంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరం నిర్వహించారు. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బాలింతలు, పిల్లలకు అందించే పోషకాహార స్టాల్‌ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్‌ హరీష్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి నాగార్జునరెడ్డి, ఎంపిడిఒ వెంకటేశ్వర రావు, ఇఒఆర్‌డి నాగరాజురావు, సచివాలయం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మడకశిర : మండల పరిధిలోని ఆర్‌.అనంతపురంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషకాహార స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఇఒఆర్‌డి శైలజ, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి రేకులకుంట హనుమంతరాయప్ప, సర్పంచి శివలింగప్ప, జడ్పిటిసి మూర్తి, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
లేపాక్షి : స్థానిక కస్తూరిబా పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అంగన్వాడీ సిబ్బంది పోషకాహార విలువలు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ బాబు, వైద్యులు చిరంజీవి, ఇఒఆర్‌డి శివన్న, కార్యదర్శులు ప్రకాష్‌, నాగేంద్ర, మారుతి, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్త ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్‌ రామాంజనేయరెడ్డి, ఇఒఆర్‌డి సిద్ధారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మైలసముద్రం గ్రామంలోని సచివాలయం వద్ద కేశపురం, నారేపల్లి గ్రామాల ప్రజలకు ఏడు రకాల వైద్య చికిత్సలు డాక్టర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శివరాం, హారిక, జమీనా బేగం, వైసిపి మండల కన్వీనర్‌ జగన్మోహన్‌ రెడ్డి, సర్పంచి నరేందర్‌ రెడ్డి ఇందరమ్మ, ప్రకాష్‌, పంచాయతీ కార్యదర్శి సురేందర్‌ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముదిగుబ్బ : మండలంలోని సానేవారిపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాజేంద్ర, నాగేంద్ర నాయక్‌, వైసిపి మండల కన్వీనర్‌ సివి. నారాయణరెడ్డి, జెడ్పీటీసీ తిరుమల సేవేనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
తలుపుల : తలుపుల-3 సచివాలయంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైద్యులు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్‌ మున్వర్‌బాషా, డాక్టర్‌ సల్మా ఆధ్వర్యంలో పలువురికి వైద్యసేవలు అందించారు.
బత్తలపల్లి : మండలంలోని మాల్యవంతం గ్రామ సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బగ్గిరి త్రివేణిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ జయరాంరెడ్డి తదితరులు మాట్లాడుతూ వైద్య సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పలు రకాల రక్త పరీక్షల నిర్వహించి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి మనోహర్‌,ఈవోఆర్డీ దివాకర్‌, సీఎస్డీటీ శారద, వైఎస్‌ఆర్సిపి మాజీ మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్‌ గంగిరెడ్డి, డాక్టర్‌ రామకృష్ణ, మహిళాస్పెషలిస్ట్‌ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు : మండల పరిధిలోని పంతులచెరువు సచివాలయ పరిధిలో గల తవలంమర్రి పాఠశాలలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన మెగా హెల్త్‌ క్యాంప్‌లో జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ముస్తఫా, కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ అనురాధ, జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్లు డాక్టర్‌ ఐనోద్దిన్‌, డాక్టర్‌ నాగార్జున రెడ్డి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులులు అంజనమ్మ, రమణారెడ్డి, కృష్ణారెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్‌ జయచంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
నంబులపూలకుంట : మండల పరిధిలోని పెడబల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి రాము, ఎంపిడిఒ ఆదినారాయణతో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ టి సరస్వతి, వైద్యాధికారులు డాక్టర్‌ ఆసియా, డాక్టర్‌ ఆనంద్‌వర్ధన్‌, వాటర్‌ షెడ్‌ చైర్మన్‌ బయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : జగనన్న ఆరోగ్య సురక్ష' పేద ప్రజలకు వరం లాంటిదని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త దీపిక అన్నారు.ఈ మేరకు ఆమె గురువారం మండలంలోని మొరసలపల్లిలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన 'జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, తహశీల్దార్‌ నాగరాజు, ఎంపిడిఒ నరేష్‌కృష్ణ, ఎంపీటీసీలు జగన్మోహన్‌ రెడ్డి, సర్పంచులు వెంకటమ్మ, తిరుమలేష్‌, మురళీమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.
కదిరి అర్బన్‌ : మండలంలోని ముత్యాల చెరువు సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎంపిపి అమర్‌ నాథ్‌ రెడ్డి, ముత్యాల చెరువు సర్పంచి శుభలేఖ విశ్వనాథ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక వైద్య అధికారులు వినోద్‌ కుమార్‌, కిరణ్‌ కుమార్‌ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అంజినప్ప, మండల పరిపాలన అధికారి వెంకట నారాయణ రావు, హెల్త్‌ సూపర్వైజర్‌ విజరు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం :గ్రామీణ ప్రాంతాలలోనే ప్రజలందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వైసిపి ఇన్‌చార్జ్‌ దీపిక వేణు రెడ్డి అన్నారు. గురువారం హిందూపురం రూరల్‌ మండలం మలగూరులో గ్రామ సర్పంచ్‌ రమేష్‌ అద్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరేంద్ర, జెడ్పీటీసీ నాగభూషణప్ప, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంత రెడ్డి, ఎంపీటీసీ తులసి, మండల కన్వీనర్‌ సంతెబిదునురు రాము తదితరులు పాల్గొన్నారు.