ముఖ్యమంత్రికి రాసిన పోస్టు కార్డులు చూపిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎపిజిఇఎ)ఆధ్వర్యంలో సోమవారం సిఎం జగన్మోహన్‌రెడ్డికి పోస్టు కార్డు ద్వారా వినతిపత్రాలు అందచేశారు. స్థానిక నగరంపాలెంలోని సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, సంఘ నాయకులు పాల్గొని సిఎంకు పోస్టు కార్డులు పోస్ట్ చేశారు. కార్యక్రమంలో ఎపిజిఇఎ జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కరిముల్లా షాఖాదరి, నగర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, దక్షిణామూర్తి పాల్గొన్నారు.










