Oct 28,2022 22:49

పనులను పర్యవేక్షిస్తున్న ఇఇ, ఇతర అధికారులు

ప్రజాశక్తి -ఆనందపురం : జగనన్న లేఅవుట్‌ హౌసింగ్‌ కాలనీలో విద్యుద్దీకరణ పనులు నిర్వహిస్తున్నట్లు హౌసింగ్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ అధికారి పాలక శ్రీనివాసరావు తెలిపారు.పేదలందరికీ ఇళ్లులో భాగంగా భీమిలి నియోజకవర్గ పరిధిలో 132 లేఅవుట్లుకు రూ.14.326 కోట్ల వ్యయంతో 9201 ప్లాట్లకు విద్యుదీకరణ పనులు చేపడుతున్నామన్నారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో 16 లేఅవుట్లలోని 1874 ప్లాట్లకు రూ.3.74 కోట్ల వ్యయంతో విద్యుదీకరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో గృహనిర్మాణశాఖ నిర్మాణాలు పూర్తిచేసిన ఆనందపురం మండలంలోని 575 ఇళ్లు, పద్మనాభంలో 286, భీమిలిలో 217, పెందుర్తి మండలంలో 258 మొత్తంగా 1336 ఇళ్లకు ప్రస్తుతం విద్యుదీకరణ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణాలు పూర్తయిన అన్ని ఇళ్లకు ఇపిడిసిఎల్‌ వ్యయంతో మీటర్‌ బోర్డు, ఎంఇబి, సర్వీస్‌వైరుతోపాటు మీటరు బోర్డు అమర్చుట, విద్యుత్‌ మీటర్‌ బిగించి, సరఫరాను అందజేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తమ శాఖ సిబ్బందికి తగు సూచనలు చేశామన్నారు. శుక్రవారం వెల్లంకి, బొడ్డపాలెం, శొంఠ్యాం, దుక్కవానిపాలెంలో జరుగుతున్న విద్యుద్దీకరణ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఇఇ పి.వెంకటేశ్వరరావు, డిఇఇ టి.కిరణ్‌కుమార్‌, ఎన్‌.అప్పన్నబాబు, ఎఇ సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.