
ప్రజాశక్తి-అనకాపల్లి
మండలంలోని కోడూరు పరిధిలోని జగనన్న లేఅవుట్లను జివిఎంసి 80, 81 వార్డుల కార్పొరేటర్లు కొణతాల నీలిమ భాస్కరరావు, పీలా సౌజన్య రాంబాబుతో కలిసి వైసిపి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ లేఅవుట్లతో పనులు మందపడిగా సాగుతున్నాయని, వేగవంతం చేయాలని, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని కోరారు. దీనిపై కలెక్టర్, హౌసింగ్ పీడీలను కలిసి చర్చిస్తామన్నారు. అర్హత గల ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పీలా శ్యామ్, దాడి ఈశ్వరరావు కర్రి అప్పాజీ, మద్దాల భీమేష్, విల్లూరి చంద్రశేఖర్, కోటిపల్లి శ్రీను, కొణతాల పరదేశి నాయుడు తదితరులు పాల్గొన్నారు.