లేఅవుట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్
జగనన్న లే అవుట్‌ను పరిశీలించిన కలెక్టర్
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని వెంకటేశ్వరపురం జగనన్న కాలనీలో 600 ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎం హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం నగర సమీపంలోని వెంకటేశ్వరపురం జగనన్న లేఅవుట్ ను మున్సిపల్ కమిషనర్ వికాస్, హౌసింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా 600 ఇళ్లను గహప్రవేశాలకు సిద్ధం చేయాలని చెప్పారు. లేఅవుట్ లో అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు, నీటి వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని, కాలనీ ముఖ ద్వారం వద్ద ఆర్చి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా సత్వరం పూర్తయ్యేలా అవసరమైన అన్ని చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు. ఇళ్లకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి నాగరాజు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ ఈఈ సోమశేఖర్, హౌసింగ్ డిఇ దయాకర్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.










