ప్రజాశక్తి- మునగపాక రూరల్ : మండలంలోని ఆనందపురం, తిమ్మరాజుపేట, ఒంపోలు, అరబుపాలెం, మునగపాక గ్రామాల్లో జగనన్న లేఅవుట్లను అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ శనివారం సందర్శించారు. లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాల జాప్యంపై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించి త్వరితగతిన ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేసే దిశగా హౌసింగ్ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, ఎంపీడీవో రవికుమార్, తహశీల్దారు బాబ్జి, ఈవోపిఆర్‌డి ఈశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : జగనన్న లే అవుట్లలో గృహ నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి నాగలక్ష్మి కోరారు. హౌసింగ్ డే సందర్భంగా శనివారం మండలంలోని ఆనందపురం, లంకవానిపాలెం, కొరువాడ గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లలో నిర్మాణాలను మండలాధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాండ్రేగుల శశిదేవి, తహశీల్దారు రమేష్ బాబు, హౌసింగ్ ఏఈ బి.రవిబాబు, ఎనర్జీస్ ఏపీవో వసంత్ కుమార్, ఓపిఆర్‌డి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
చీడికాడ :మండలంలోని జి.కొత్తపల్లి గ్రామం లో జగనన్న లే అవుట్లను మండల ప్రత్యేక అధికారి బివి మహేశ్వరరావు, హౌసింగ్ డిఈ ఏవి వీఎస్‌ఎన్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీలైనంత వరకు తొందరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బివి రాణి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జయప్రకాష్‌రావు, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, ఇంజనీర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
కోటవురట్ల : మండలంలో పీకేపల్లిలో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన నిర్మాణాలు చేపట్టక పోవడంపై శనివారం మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ ఆరా తీశారు. సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీసిల్దారు సోమశేఖర్, ఎంపీడీవో చంద్రశేఖర్, హౌసింగ్ ఇంజనీరు జగదీశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.










