
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :జగనన్న లే అవుట్లలో అంతు లేని అవినీతి చోటు చేసుకొంద ని జనసేన పార్టీ సర్వేపల్లి ని యోజకవర్గం సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ విమర్శించా రు. శనివారం అయన తోటప ల్లిగూడూరు మండలంలోని జ గనన్న లే అవుట్లను పరిశీలిం చారు. ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ పేదలకి ఇళ్ల స్థ లాల పేరుతో ప్రైవేటు భూము ల కొనుగోళ్లలో కోట్లాది రూపా యల కుంభకోణం జరిగింద న్నారు. కొనుగోలు చేసి వాటి లో పూర్తిస్థాయిలో అభివద్ధి చేయకుండానే అసంపూర్తిగా వదిలివేశారాని ఫలితంగా లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సురేష్ ధ్వజమెత్తారు. అసంపూర్తిగా వున్న వాటిని పేదలు ఏమి చే సుకుంటారని అయన ప్రశ్నిం చారు. పలు జగనన్న లేఅవుట్లలో మౌళిక వసతుల కల్పనలు కల్పించలేదన్నారు. జగనన్న గహాలు పూర్తి స్థాయిలో నిర్మించకుండానే వైసీపీ డప్పులు కొట్టుకుంతోందని సురేష్ ఏద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలోని తోటపల్లిగూడూరు మండలంలో జగనన్న లేఅఔట్లలో చేపలగుంటలు, కారుతుమ్మ చెట్లు, మధ్యం బాటిళ్ళు దర్శనం ఇస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేకించి మంత్రి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్లలో రూ.కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సురేష్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తోటపల్లిగూడూరు మండల అ ధ్యక్షుడు అంక్యం సందీప్, కోసూరు నారాయణ, శరత్,ముత్తుకూరు మండల నాయకులు అశోక్, సుమన్, వెంకటాచల మండలం కార్యదర్శి శ్రీహరి, మండల నాయకులు ఖాజా, వంశీ, తదితరులు పాల్గొన్నారు.