ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:జగనన్న క్రీడా సంబరాలు 2022 పోస్టర్‌ను ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్శన్ గుడబండి ఆదిలక్ష్మీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంత వరకూ స్పోర్ట్స్ క్రీడాకారులకు లక్షల్లో నగదు బహుమతులలు ఇవ్వడం ఇదే ప్రధమన్నారు. ఐదు ఆటల్లో రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తున్నారన్నారు. గ్రామానికి క్రీడా క్లబ్లు ప్రారంభించి అందులో క్రీడాకారులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహిస్తుంచడం అభినందనీ యమ న్నారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు. నర్సీపట్నం నియోజకవర్గలో మూడు ఆటల పోటీల్లో ఐదు టీములు జిల్లాకు వెళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యా పారవేత్త వెలగా నారాయణరావు, శాప్ కోచ్ అబ్బు, క్రీడాకారులు పాల్గొన్నారు.










