జగనన్న కంటి వెలుగుకు విశేష స్పందన: ఎంపీపీ
ప్రజాశక్తి- బంగారుపాళ్యం: జగనన్న కంటి వెలుగు కు విశేష స్పందన వస్తోందని ఎంపీపీ అమరావతి అన్నారు. శనివారం మండలంలోని కూర్మాయిపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తుంబుకుప్పం ప్రాథమిక వైద్యులు లోహిత్ చంగల్ రాయలు ఆధ్వర్యంలో ఇర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అమరావతి మాట్లాడుతూ భారత దేశంలోనే ఆరోగ్య శిబిరాలు ఎక్కడ ప్రారంభించలేదని తన పాదయాత్రలో క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలని ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రారంభించారని ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల్లో అవలంబించాల ఆలోచనలు ఉన్నారన్నారు అనంతరం పలువురికి వైద్య పరీక్షలు చేపట్టి తగిన మందులు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు హేమలత, దీప, ఇంచార్జ్ తహశీల్దారు అనిల్ కుమార్, ఇన్‌చార్జి ఎంపీడీవో హరి ప్రసాద్ రెడ్డి అంగన్వాడి సూపర్వైజర్ జయ శ్రీ, డాక్టర్లు యుగంధర్, రమేష్, వైద్య, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, నాయకులు పాల్గొన్నారు.










