Jun 25,2023 00:43

మాట్లాడుతున్న ఎంపిడిఒ పూర్ణయ్య

ప్రజాశక్తి-పెదబయలు:మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులతో శనివారం ఎంపీడీఓ ఎల్‌.పూర్ణయ్య, మండల విద్యాశాఖదికారి జోసఫ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ, జగనన్న కిట్స్‌ను ప్రతి ఒక్క విద్యార్థికి పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు.బడి ఈడు చిన్నారులందర్నీ పాఠశాలలో చేర్పించి నమోదుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో ఉన్న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, గ్రామ వాలంటీర్ల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఆదేశించారు. నాడు నేడు పనులకు సంబందించిన పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా చూడాలన్నారు. నిర్ధిష్ట గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం జులై 1 నుండి ప్రతి గ్రామ సచివాలయంలో జరుగుతంఉదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.