Nov 26,2022 23:56

మాట్లాడుతున్న ఉదయశ్రీ

ప్రజాశక్తి-కోటవురట్ల:ఎండపల్లి, జల్లూరు, సుంకపుర్‌, గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలను శనివారం మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ సందర్శించారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు కాలనీ వద్ద ఎదుర్కొంటున్న సమస్యలు ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌ జానకమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌, హౌసింగ్‌ జగదీశ్వరరావు, పిఆర్‌ జెఇ వర్మ పాల్గొన్నారు.