ప్రజాశక్తి - భట్టిప్రోలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలలో నిర్మాణాల వేగవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గృహ నిర్మాణ పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని ప్రభుత్వం ముందుగానే అందిస్తున్నందున లబ్ధిదారులు గృహాలు ప్రారంభించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పొదుపు సంఘాల నుండి రూ.30వేల రుణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దీనితో బేస్పేట్ పూర్తిచేసుకుని వచ్చే బిల్లులతో నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పిడి అర్జునరావు, రేపల్లె ఆర్డిఓ జగన్నాథం పార్థసారథి, అధికారులు ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.










