May 24,2023 19:12

చిప్పగిరి జగనన్న కాలనీలోని వసతులను పరిశీలిస్తున్న ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి జగనన్న కాలనీలో థర్డ్‌ పార్టీకి చెందిన కాంట్రాక్టుదారులు గృహాలను నిర్మిస్తున్న నేపథ్యంలో బుధవారం కాలనీలోని నీటి వసతులను మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ వేణుగోపాల్‌, మండల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడారు. గృహ నిర్మాణాలు వేగవంతమయ్యేందుకు సంబంధిత లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న పిల్లల సర్వేను త్వరగా పూర్తి చేసేలా గ్రామ వాలంటీర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ సుధాకర్‌ రాజు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ రామ్‌ నీలా, ఎపిఎం నాగార్జున, ఎపిఒ మాధవ శంకర్‌, పంచాయతీ కార్యదర్శి బాలన్న, హౌసింగ్‌ భవ్య, ప్రభుత్వ డాక్టర్‌ జమీల్‌ అహ్మద్‌, థర్డ్‌ పార్టీకి చెందిన కాంటాక్టుదారులు పాల్గొన్నారు.