ప్రజాశక్తి - ముదినేపల్లి
జగనన్న కాలనీల లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు పూర్తి చేయడం ఆనందదాయకమని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని సింగరాయపాలెంలో జగనన్న కాలనీలో విద్యుత్ లైన్, వీధి దీపాలను శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో ప్రజలకు ఇబ్బందిలేకుండా మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జగనన్నకాలనీ నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఇంత త్వరగా ఇళ్లను పూర్తి చేయడానికి ఎంఎల్‌ఎ సహకారం ఎంతో ఉందన్నారు. అనంతరం గ్రామస్తులు డిఎన్‌ఆర్‌ను సన్మానిం చారు. సర్పంచి బోయిన విమలా భర్త రామరాజు త్వరితగతిన కాలనీకి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా గ్రామస్తు లకు సహకారం అందించిన డిఎన్‌ఆర్‌ను, విద్యుత్ శాఖ అధికారు లు ఇఇ రామకృష్ణను, డిఇఇ దశరధన్‌ను, ఎఇ పి.రవికుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, వైస్ ఎంపిపిలు సునీత, రాధ, జెడ్‌పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ, పార్టీ మండల అధ్యక్షులు మోట్రు ఏసుబాబు, పార్టీ నేతలు బొర్రా శేషుబాబు, ఆలయ ఛైర్మన్ శొంఠి నాగరాజు, ఆర్.కొండ, విద్యుత్ ఎఇ పేర్ని రవికుమార్, పాల్గొన్నారు.










