May 18,2023 20:02

జగనన్న కాలనీలో జెసిబి ద్వారా ముళ్లకంపను తొలగిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి జగనన్న కాలనీలో ముళ్లకంపలతో నిండి ఉన్న నేపథ్యంలో తొలగించారు. గురువారం ఎంపిడిఒ సుధాకర్‌ రాజు, సర్పంచి గోవిందరాజులు, హౌసింగ్‌ ఎఇ భవ్య, పంచాయతీ కార్యదర్శి బాలన్న ఆధ్వర్యంలో జెసిబి ద్వారా ముళ్లకంప తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధికారుల ఆదేశాల మేరకు థర్డ్‌ పార్టీకి చెందిన కాంట్రాక్టుదారులు జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలో లోతుగా ఉన్న రాళ్లను, ముళ్లకంపను తొలగించి నీటి సౌకర్యానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. లబ్ధిదారులందరూ థర్డ్‌ పార్టీ వారితో ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు రావాలన్నారు.