Jul 22,2022 23:20

జగనన్న కాలనీలో హెచ్చరిక బోర్డులు

భూపరిహారం చెల్లించకపోవడంపై ముదపాక వాసుల ఆందోళన
ప్రజాశక్తి- పెందుర్తి : జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించిన భూమికి పరిహారం చెల్లింపులో జాప్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముదపాకలో ఇళ్లపట్టాల స్థలంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.తమకు పరిహారం చెల్లించకుండా ఆ భూముల్లోకి ఇళ్లస్థలాల లబ్ధిదారులెవరు వచ్చినా వెనక్కు పంపుతామని హెచ్చరించారు.
మండలంలోని ముదపాకలో ఇళ్లస్థలాల కోసం సేకరించిన భూములకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థల సేకరణ సమయంలో గజానికి రూ.900చొప్పున పరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారని, నాటి అధికారులు బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన వారు పరిహారం చెల్లింపుపై అలసత్వం చూపుతున్నారన్నారు.దీనిపై తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వాసిత రైతులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇవీవీ పట్టకుంటా ఆయా భూముల్లో జగనన్న ఇళ్లపట్టాలను ఇవ్వడంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాలను చూసేందుకు వస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులకు టిడిపినేతలు అండగా నిలవడంతో శుక్రవారం భూసేకరణ స్థలంలో రైతులంతా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేత జి.సత్యనారాయణ మాట్లాడుతూ, భూములకు పరిహారం చెల్లించకుండా లబ్ధిదారులకు స్థలాలను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే స్థలాల్లోకి లబ్ధిదారులను అడుగుపెట్టబోనివ్వమని హెచ్చరించారు.
భూపరిహారం చెల్లించకపోవడంపై ముదపాక వాసుల ఆందోళన

ప్రజాశక్తి- పెందుర్తి :
జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించిన భూమికి పరిహారం చెల్లింపులో జాప్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముదపాకలో ఇళ్లపట్టాల స్థలంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.తమకు పరిహారం చెల్లించకుండా ఆ భూముల్లోకి ఇళ్లస్థలాల లబ్ధిదారులెవరు వచ్చినా వెనక్కు పంపుతామని హెచ్చరించారు.