Nov 03,2022 23:36

మాట్లాడుతున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి- చీడికాడ: జగనన్న కాలనీలను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో జయప్రకాష్‌ రావు కోరారు. మండలంలో చుక్కపల్లి గ్రామంలో జరుగుతున్న జగనన్న కాలనీ పనులను ఎంపీడీవో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌రావు మాట్లాడుతూ, గ్రామంలో గృహాలు నిర్మించుకునే వారు ఉంటే వాలంటీర్లకు తెలియ జేయాలన్నారు. పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఈనెల 7తో గడువు ముగుస్తుందన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఓ మోదినాయుడు, వైసిపి నాయకులు దేవానందం పాల్గొన్నారు.