
ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
మండలంలో రాజాంలోని జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శిరీషా రాణి, శనివారం స్థానిక ఎంపీడీవో సువర్ణ రాజుతో కలిసి పరిశీలించారు. రాజాంలో 104 లేఅవుట్లకు గాను 53 ఇళ్లు పూర్తయినట్లు, మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు ఎంపీడీఓ సువర్ణ రాజు డిపిఒకు వివరించారు. లేఅవుట్‌లో మౌలిక సదుపాయాలను ఆమె పరిశీలించారు. అనంతరం స్థానిక అంగనవాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఆహారంలో నాణ్యతను పాటించాలని అంగన్వాడీ వర్కర్లను అదేశించారు. సబ్ సెంటర్‌ను సందర్శించి సిబ్బంది హాజరును పరిశీలించారు. చెత్త సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. మండలంలో ఇప్పటివరకు నమోదైన స్పందన ఫిర్యాదులను స్వయంగా ఆమె అధికారులతో కలిసి పరిశీలించి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్‌డి విజయలక్ష్మి, స్థానిక పంచాయతీ కార్యదర్శి ఏ.శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ గోపీనాథ్ పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో ఇళ్ల నిర్మాణాలను శనివారం మండల ప్రత్యేక అధికారి రోజారాణి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. సబ్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాల్లో తనీఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఖాన్, ఎపిఓ శివ, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, మండల సమాఖ్య ఎపిఓ ఎమ్ శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి సత్యారావు పాల్గొన్నారు.