Aug 25,2023 21:56

జగనన్న ఇళ్లనుసందర్శిస్తున్న నాయకులు


జగనన్న ఇళ్లనుసందర్శిస్తున్న నాయకులు
జగనన్న కాలనీలకు కళ
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం:నూతన గహ నిర్మాణాలతో జగనన్న కాలనీలకు కళ కలుగుతోందని కోవూరు నియోజకవర్గ యువజన అధ్యక్షులు నల్లపరెడ్డి రజిత్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని పెద్దూరు మంగల కట్ట వద్ద గల ఎన్‌.ఎస్‌.ఆర్‌.బీసీ కాలనీలో పేదల కోసం నిర్మిస్తున్న వై ఎస్‌ ఆర్‌ జగనన్న కాలనీలో సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె ఇళ్లలో ఏళ్ల తరబడి అవస్థలు పడ్డ అక్కచెల్లెమ్మలకు రూ.లక్షల విలువైన స్థిరాస్తి ఉచితంగా సమకూరుతోందన్నారు. పేదలకు వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలిచ్చి గహాలను కూడా నిర్మిస్తుండటంతో అద్దె ఇళ్ల కష్టాలకు శాశ్వతంగా తెరపడుతోంది.
విలువైన ప్రాంతాల్లో కలల సౌధాలను 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం ద్వారా సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శరవేగంగా సాకారం చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోందన్నారు.