Feb 16,2023 16:52

ట్యాంకు కొళాయిలను ప్రారంభిస్తున్న సర్పంచు శేషన్న

జగనన్న కాలనీకి నీరు సరఫరా : సర్పంచు
ప్రజాశక్తి - పగిడ్యాల

      పగిడ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీకి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసినట్లు సర్పంచు పెరుమాళ్ళ శేషన్న గురువారం తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచు మాట్లాడారు. గ్రామంలోని జగనన్న కాలనీలో నీటి సమస్య తలెత్తకుండా రౌండ్‌ ట్యాంకు నిర్మించి పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయించామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని, కాలనీలో ఇండ్ల నిర్మాణానికి నీటి సమస ఉన్నందున్న లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు నీటి వసతిని ఏర్పాటు చేశామన్నారు.