జగనన్న కాలనీలో పర్యటిస్తున్న టిడిపి నాయకులు సాయిబాబా
ప్రజాశక్తి-భట్టిప్రోలు: ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివేశన స్థలాలలో కనీస వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా వాటిని పరిశీలించేందుకు శుక్రవారం టిడిపి రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా కాలనీలో పలువురు లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస వసతులైన రహదార్లు, నీరు, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు లబ్ధిదారులు సాయిబాబా ఎదుట వాపోయారు. ముందుగా జగనన్న కాలనీల పరిశీలనకు టిడిపి పిలుపునివ్వటంతో అధికారులు శుక్రవారం నీటిని పుష్కలంగా విడుదల చేయటం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, అధిన బసవపున్నయ్య, సుధీర్, సయ్యద్ కలాం, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.










