ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని తెర్నేకల్ గ్రామంలో జగనన్న కాలనీని ఈనెల 20 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సర్పంచి మొగతాల్ అరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం తెర్నేకల్‌లో జగనన్న కాలనీ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో మొదటి దశ కింద 199 ఇళ్లకు గాను 84 ఇళ్లు పూర్తి చేసినందుకు ఎంపికైనందుకు లబ్ధిదారులను ప్రశంసించారు. ఇందుకు కృషి చేసిన ఇంజినీర్ అసిస్టెంట్లు గోపాల్, మల్లికను అభినందించారు. ఎంపిపి భర్త దాసరి లుమాంబ, ఉప సర్పంచి భర్త ఈరన్న, హౌసింగ్ ఇఇ ప్రభాకర్, డిఇ ఆది నారాయణ, విద్యుత్ డిఇ సుధాకర్, ఎడి రామకృష్ణ, ఎఇ నారాయణ స్వామి, పంచాయతీ కార్యదర్శి సునీత, సచివాలయ కన్వీనర్ వాల్మీకి రాఘవేంద్ర, చాప ఈరన్న, వైసిపి నాయుకులు లింగన్న, ఏసేపు, నాగన్న పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచి అరుణ్ కుమార్










