Aug 26,2023 22:03

గృహ నిర్మాణాలను పరిశీలిస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి - నెల్లూరు :జగనన్న కాలనీ లే అవుట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన మేరకు అదనపు కార్మికులను నియమించుకుని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్‌ విభాగం అధికారులను నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఆదేశించారు. జగనన్న కాలనీల నిర్మాణ పనుల పురోగతిపై హౌసింగ్‌ విభాగం, ఏపీఎస్‌ పిడిసిఎల్‌, నగర పాలక సంస్థ అధికారులతో స్థానిక వెంకటేశ్వరపురంలోని లే అవుట్‌ ను కమిషనర్‌ శనివారం పరిశీలించారు. జగనన్న కాలనీ లే అవుట్లలో అవసరమైన మంచినీటి కుళాయిలు కనెక్షన్లు, విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు, రోడ్‌ లెవెలింగ్‌ పనులు, పెయింటింగ్‌, ఇతర నిర్మాణాలు వంటి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను కల్పించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, కాంట్రాక్టర్లు, అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. వందశాతం నిర్మాణ పనులు పూర్తయిన గహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.