Dec 03,2022 23:28

లే అవుట్‌ను పరిశీలిస్తున్న అదికారులు

ప్రజాశక్తి-కొత్తకోట:జగనన్న ఇల్లు నిర్మాణం లో లబ్ధిదారులు అలసత్వం వహిస్తే లబ్ధిదారుల జాబితా పై పున: ఆలోచన చేయాల్సి వస్తోందని గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ ఆఫీసర్‌ టి.సుబ్బారాయుడు స్పష్టం చేశారు. రావికమతం మండలం కొత్తకోట గ్రామ సమీపంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలో తహసీల్దార్‌ మహేశ్వర రావు, ఎంపిడిఓ వెంకన్నబాబు, హౌసింగ్‌ ఏఇ రామచంద్రరావు, పిఆర్‌ జెఇ సుమతి తదితర అధికారుల బృందం శనివారం పర్యటించారు. ఈ సందర్బంగా పలువురు లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు గృహ వసతి కల్పించాలన్న సంకల్పంతో స్థలం కొనుగోలు చేసి పంపిణి చేయడం జరిగిందన్నారు. ఏడాది కాలంగా ఇల్లు నిర్మాణాలకు చొరవ చూప లేదన్నారు. 240 లబ్ధిదారులలో కేవలం 100 మంది మాత్రమే నిర్మాణ పనులు చేపట్టారని, మిగిలిన వారు నిర్లక్ష్యం గా ఉన్నారని వీరి పై ప్రభుత్వం పున:ఆలోచన చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇల్లు నిర్మాణానికి కావాల్సిన మౌళిక సదుపాయాలు విద్యుత్‌, తాగునీరు తక్షణమే కల్పిస్తామని చెప్పారు. ఇసుక, సిమెంట్‌, ఐరెన్‌, నగదు పేమెంట్‌ దశల వారీగా అందజేస్తామని తెలిపారు. త్వరలో మరో మారు పరిశీలన చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కోన లోవరాజు, ఉప సర్పంచ్‌ పందల దేవ, వార్డు శివాజీ తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల: మండల వ్యాప్తంగా జగనన్న లే అవుట్లలో కాలనీ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిం చేందుకు తహసిల్దార్‌ జానకమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌లు బోడపాలెం, పాములవాక గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోడపాలెం గ్రామం పంచాయతీలో 132 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయగా 85 మంది లబ్ధిదారులకు 2 కాలనీ లేఅవుట్లు స్థలం కేటాయించారు. 25 మంది లబ్ధిదారులు సొంత స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. అదేవిధంగా పాములవాక గ్రామంలో రెండు లేఅవుట్లలో 118 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా 68 మంది నిర్మాణాలు చేపడుతున్నారు. సొంత స్థలాలు కలిగిన వారు 29 మంది ఇళ్ళ మంజూరు కోసం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అదేవిధంగా ప్రధానంగా కాలనీల వద్ద రోడ్ల నిర్మాణం లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని. బిల్లులు సకాలంలో అందజేయాలని అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.ఈ కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు కిల్లాడ శ్రీనివాసరావు, బోడపాలెం గ్రామ సర్పంచ్‌ ఎరుకు నాయుడు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరు జగదీశ్వరరావు, జెఈ కరుణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.