ప్రజాశక్తి - కొయ్యలగూడెం
ఇళ్ల స్ధలాల మంజూరు కోసం భూ సేకరణలో భాగంగా మంగళవారం రాజవరంలో భూమిని జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు పరిశీలించారు. స్థలం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్ధలం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా రాజవరంలో 83 మందికి గతంలో ఇళ్ల పట్టాలు అందించగా ప్రస్తుతం మరో 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇళ్ల స్థలాలు అందించేందుకు రాజవరంలో గుర్తించిన 27 సెంట్ల భూమిని జెసి పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దారు పి.నాగమణి, వైసిపి ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు, ఆర్‌ఐ మని దివ్య పాల్గొన్నారు.










