ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని రావణాపల్లి గ్రామంలో జగనన్న కాలనీలను శనివారం ఎంపిడిఒ డేవిడ్‌రాజు, హౌసింగ్ ఏఈ మధు పరిశీలించారు. ఇళ్లు నిర్మించని వారు వెంటనే నిర్మించుకోవాలని, లేదంటే పట్టాలు రద్దు అయ్యే అవకాశం ఉందని, కట్టిన వారికి వెంటనే బిల్లులు చెల్లిస్తామని లబ్ధిదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అప్పారావు, పిఎసిఎస్ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, ఎఎసి చైర్మన్ కొల్లు సత్యనారాయణ, స్కూల్ కమిటీ చైర్మన్ చిరంజీవి, కొల్లు లోవరాజు, సచివాలయ సిబ్బంది వంగ నవీన్, గ్రామ వాలంటీర్లు, పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలపై అవగాహన
కోటవురట్ల:మండలంలో పలు గ్రామాల్లో శనివారం ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జగనన్న గృహ నిర్మాణాల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన లే అవుట్లు సహా పలు గ్రామాల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సిమ్మెంటు, ఇసుక, ఐరన్, అదేవిధంగా డోర్లు, కిటికీలు అందిస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేశారు. మంజూరైన ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కాలనీల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీరు జగదీశ్వరరావు, పిఆర్‌జెఈ వర్మ, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.










