Feb 19,2023 00:56
జగనన్న గృహాలు పరిశీలిస్తున్న జేసీ శ్రీనివాసులు

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు గృహ నిర్మాణాన్ని అందజేస్తుందని, జగనన్న గృహాలను ఆయా కాంట్రాక్టర్లు త్వరగా పూర్తి చేయాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని పలు జగనన్న కాలనీ లేఔట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతంగా నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. గృహ నిర్మాణాలలో లక్ష్యాలను సకాలంలో సాధించే విధంగా అధికారులు అందరూ సమన్వయంగా కృషి చేయాలని అన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లను, గృహనిర్మాణ లబ్ధిదారులను సమన్వయం చేస్తూ గృహాలను వేగవంతంగా నిర్మించాలని సూచనలు చేశారు. గృహ నిర్మాణాలకు సంబంధించి అన్ని వసతులను లబ్ధిదారులకు కల్పించాలని అన్నారు.
రోడ్లు, ఇసుక, సిమెంటు, నీటి కొరత వంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. కాలనీలో లబ్ధిదారులు నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని అన్నారు. జగనన్న కాలనీలో రోడ్ల నిర్మాణం సమస్య ఉందని పలువురు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం కేటాయించిన నిర్ణీత గడువులోపే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అన్నారు. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఆయన వెంట ఆర్డీవో సరోజిని, తహశీల్దారు ప్రభాకర్‌రావు, హౌసింగ్‌ డిఈ, ఏఈ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.