Jul 11,2023 17:31

సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకులు

జగనన్న గోరుముద్ద పథకం మెస్ చార్జీలు పెంచాలి
ప్రజాశక్తి బనగానపల్లె

     జగనన్న గోరుముద్ద కు మెస్ చార్జీలు పెంచాలని ఏఐటీయూసి మండల కార్యదర్శి   కుల్లాయిస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయంలో ఏఐటీయూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుల్లాయిస్వామి మాట్లాడుతూ  జగనన్న గోరుముద్ద  పథకం విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచకపోవడం వల్ల  నిత్యవసర వస్తువుల పెరుగుదలతో కార్మికులకు మధ్యాహ్న భోజనం వండడం పెనుబారంగా మారిందన్నారు.మహిళా కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ పథకాన్ని కొనసాగిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకానికి మెస్ చార్జీలు పెంపుదల చేసి కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు    ఎం రవి, ఎల్ వెంకటలక్ష్మి, మద్దయ్య , కేశాలు తదితరులు పాల్గొన్నారు.