ప్రజాశక్తి - పోలవరం
మండలంలోని ప్రగఢపల్లి, వింజరం గ్రామ సచివాలయం పరిధిలో వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద ప్రజలకు జగనన్న భూహక్కు పత్రాలను జిల్లా ఎంపీపీ సంఘాల అధ్యక్షులు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నాగరాజు, ఎంపిటిసి కుంజం చిట్టెమ్మ, సర్పంచి కోక్కెర వెంకటలక్ష్మి, ప్రగఢపల్లి విఆర్‌ఒ, వింజరం విఆర్‌ఒ పాల్గొన్నారు.










