Oct 09,2023 23:24

ప్రజాశక్తి - పంగులూరు
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు శాప్ నెట్ చైర్మన్, వైసిపి ఇన్చార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిభిరం మండలంలోని తూర్పు కొప్పెరపాడు గ్రామంలో సోమవారం నిర్వహించారు. అనారోగ్య సమస్యలతో ప్రజల విలువైన జీవితాలు నష్టపోకూడదని, రూ.లక్షలు ఖర్చుపెట్టినా ఆరోగ్యం కుదుట పడని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అలాంటి ప్రజలకు ఖర్చు లేకుండా విలువైన ఆరోగ్య సేవలను అందించేందుకు సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇంటివద్దకే వైద్యసేవలను అందించే విధంగా కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. సంక్షేమ పదకాల ద్వారా ప్రజలకు చేరువైన సిఎం వైఎస్‌ జగన్‌ మళ్లీ సిఎం కావడం ఖాయమని అన్నారు. ప్రతిపక్ష టిడిపి అధికారం కోసం అర్రులు చాస్తుందని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నాడని అన్నారు. టిడిపి ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్మోహన్‌రెడ్డిని, వైసీపీని ఏమీ చేయలేరని అన్నారు. ఎంపిడిఒ బి రామాంజనేయులు పర్యవేక్షణలో జరిగిన వైద్యశిభిరంలో నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్స్ వైద్యపరీక్షలు చేశారని అన్నారు. 318 టోకెన్సు రైజ్ చేయగా 405ఓపిలు నమోదయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో తూర్పకొప్పెరపాడు సర్పంచ్ వై కళ్యాణి, తూర్పు తక్కెళ్ళపాడు సర్పంచ్ మేడూరి అంజయ్య, ఎంపిటిసి నూకతోటి సింధూర, మాజీ సర్పంచి సుబ్బారావు, వైసీపీ నాయకులు ఇనుకపాటి శ్రీనివాసరావు, పంగులూరు పిహెచ్‌సి డాక్టర్ శివ చెన్నయ్య, ఎంఇఒ వీరాంజనేయులు, ఈఓఆర్డి రాంబాబు పాల్గొన్నారు.