ప్రజాశక్తి-ఆదోనిరూరల్
'జగనన్న ఆరోగ్య సురక్ష' ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్న సర్పంచి ప్రహ్లాద యాదవ్ తెలిపారు. గురువారం మండలంలోని విరుపాపురం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి ఆరుమణమ్మ, సర్పంచి ప్రహ్లాద యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చడం, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి గడపకు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'జగనన్న ఆరోగ్య సురక్ష' చేపట్టారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, ఎమ్మెల్యేగా సాయిప్రసాద్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. డిప్యూటీ తహశీల్దార్ రజనీకాంత్ రెడ్డి, ఎంపిటిసి శివకుమార్, డాక్టర్ ఇబ్రహీం, డాక్టర్ సుస్మిత, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ సురేష్, ఇన్‌ఛార్జీ సిడిపిఒ సావిత్రి, తిరుమలరెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచి ప్రహ్లాద యాదవ్










