ప్రజాశక్తి-కోటనందూరు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకే వైద్యం చేరుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం తుని పట్టణంలోని మంత్రి కార్యాలయంలో తొండంగి, కోటనందూరు, తుని ఏరియా ఆసుపత్రుల వైద్య బృందాలతోనూ మండల స్థాయి అధికారులతో, ప్రజా ప్రతినిధులతోనూ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామాలలో ప్రతి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్య పరీక్షలు ఏడు రకాలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది గుర్తిస్తారన్నారు. ఆ గ్రామానికి చెందిన వైద్య సురక్ష టీములో చేర్చాలని వివరించారు. ఇలా చేసినట్లయితే ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేశామని వైద్య బందాలు మండల స్థాయి అధికారులు మంత్రికి వివరించారు. గ్రామాలలోని నిరక్షరాక్షలైన ప్రజలను చైతన్యవంతులు చేసి వైద్యులకు సహకరించే దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో లగుడు శ్రీనివాస్, సోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, ఎస్ రాంబాబు, ఎంపిడిఒ ఎస్‌ఎస్.శర్మ పాల్గొన్నారు.










