ప్రజాశక్తి-యంత్రాంగం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభించారు. వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు, ఆశాలు చేసిన ఇంటింటి సర్వే ఆధారంగా ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించనున్నట్టు అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్ పి.వెంకటాపూరం పంచాయతీ పండూరు-2 సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎంపీ వంగా గీత, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు ప్రారంభించారు. వైద్య శిబిరంలోని జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనిక్, పిడియాట్రిక్ వైద్య సేవల విభాగాలతో పాటు రిజిస్ట్రేషన్, డేటా ఎంట్రీ, ఆరోగ్యశ్రీ రిఫరల్, బ్లడ్ టెస్ట్, బిసి, సుగర్ పరీక్షలు, ఫార్మసీ, న్యూట్రిషన్ కౌన్సిలింగ్ తదితర కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా మాజీ సిఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, 108 వంటివాటితో పేదలకు ఆరోగ్య భద్రత కల్పించారని.. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎన లేని కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, జెడ్‌పిటిసి నురుకుర్తి రామకృష్ణ, ఎఎంసి ఛైర్మన్ గీసాల శ్రీనివాసు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ జె.నరసింహ నాయక్, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ పి.రాధాకృష్ణ, ఐసిడిఎస్ పీడీ కె.ప్రవీణ, డిఎల్‌డిఒ పి.నారాయణమూర్తి, ఎంపిడిఒ కె.స్వప్న పాల్గొన్నారు. పెద్దాపురం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు మున్సిపల్ హైస్కూల్లో, చదలాడలో శిబిరాన్ని ప్రారంభించారు. చైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, చదలాడ సర్పంచ్ ఒబిలిశెట్టి పెదకాపు డాక్టర్ సరిత, ఎంపిడిఒ అశోక్ కుమార్, కమిషనర్ కె.సురేంద్ర, నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి, జెడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, ఎంపిపి పెంకే సత్యవతి పాల్గొన్నారు. కరప ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు జెడ్‌పి హైస్కూల్లో సర్పంచ్ సాదే ఆశాజ్యోతి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. జెడ్‌పిటిసి వై.సుబ్బారావు, పెంకె శ్రీలక్ష్మీ సత్తిబాబు, వైస్ ఎంపిపి భీమన్న, చింత ఈశ్వరరావు, తహశీల్దారు పొన్నమండ శ్రీనివాసరావు, ఎంపిడిఒ కె.అప్పారావు, ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీనివాస్ నాయక్, కార్యదర్శి నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు. తాళ్లరేవు గోవలంకలో ఎంపిపి రాయుడు సునీత ప్రారంభించారు. సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ, ఎంపిడిఒ అనుపమ, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, ఎంపిటిసిలు కూరాటి శ్రీకష్ణ, మోర్త బీమా భాయి,కార్యదర్శి సుధారాణి, వల్లి బాబు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, కమిషనర్ జి.రామారావు పట్టణంలోని గణపతి నగరం అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్, గోకిన సునేత్ర దేవి పాల్గొన్నారు. వికె.రాయపురం జెడ్‌పి స్కూల్లో క్యాంపును ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు ప్రారంభించారు. ఎంపిడి డి.శ్రీలలిత, వైద్యాధికారి డాక్టర్ పి.ప్రశాంత్, ఇఒపిఆర్‌డి కర్రి హరికృష్ణ సత్యారెడ్డి పాల్గొన్నారు. యు.కొత్తపల్లి పొన్నాడలో సర్పంచ్ బండి రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో ఎంఎల్‌ఎ పెండం దొరబాబు పాల్గొన్నారు. సర్పంచులు రావి రమేష్, నక్కా మణికంఠ బాబు, ఉమ్మిడి జాన్, జయ బాబు, ఆనాల సుదర్శన్, జెడ్‌పిటిసి తులసి కుమార్, కారే శ్రీనివాస్, బండి దావీదు, దాకే రాజ్ కుమార్, బాబులు పాల్గొన్నారు. గండేపల్లిలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు మాట్లాడారు. ఎంపిపి దొరబాబు, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్, జనపరెడ్డి బాబు, గ్రామ సర్పంచ్ లలిత, వైద్యాధికారి సౌమ్య పాల్గొన్నారు. ఏలేశ్వరం మండలం తిరుమాలిలో ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సూతి కృష్ణప్రసాద్, నీరుకొండ సత్యనారాయణ, అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, చిక్కాల లక్ష్మణరావు, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ ఉన్నారు.










