
ప్రజాశక్తి- సాలూరు : రాష్ట్రంలోని పేదల సంక్షేమమే పరమావధిగా సిఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు. శనివారం పట్టణంలోని 8వ సచివాలయం పరిధిలో ఉన్న బంగారమ్మ కాలనీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేట్ వైద్యం పొందలేని పేదల కోసం ప్రభుత్వం నిపుణులైన వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని వీటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ టి.జయరాం, వార్డు కౌన్సిలర్ పి.మధుసూధన రావు, పట్టణ వైసిపి అధ్యక్షులు రాంబాయి పాల్గొన్నారు.
డిఐఒ ఆకిస్మక తనిఖీ
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా శనివారం బంగారమ్మ కాలనీలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి.జగన్మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిబిరంలో ఎంతమంది రోగులకు టోకెన్లు జారీ చేశారు? ఏయే వైద్య సేవలు అందిస్తున్నారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించారు. వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. ఆయన వెంట డాక్టర్ మహిపాల్, డాక్టర్ హర్షిత, సచివాలయం కార్యదర్శి మురళీకృష్ణ పాల్గొన్నారు.
సాలూరు రూరల్: జగనన్న సురక్ష పేద ప్రజల పాలిట శ్రీరామ రక్ష అని వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ అన్నారు. ఆంధ్రా ఒడిస్సా వివాదాస్పద గ్రామమైన పట్టు చెన్నూరులో ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు భరత శ్రీనివాసరావు, సర్పంచులు సుధా, ఆదయ్య, నూకయ్య, బేతురు, అనిల్, కొండపల్లి సింహాచలం పాల్గొన్నారు.
జగనన్న లేఅవుట్‌లో సదుపాయాలు కల్పించండి
మండలంలోని నెలిపర్తి జగనన్న లేఅవుట్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సాలూరు మున్సిపల్ కమిషనర్‌నకు లబ్ధిదారులు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగనన్న గృహ సముదాయాలు నిర్మాణం వద్దకు అవసరమైన సిమెంట్, ఇటుక, ఇసుక, పిక్క తదితర వస్తువులు తీసుకువెళ్లడానికి సరైన రోడ్లు లేక పోవటంతో లబ్దిదారుల చాలా ఇబ్బందులు పడుతున్నార న్నారు. ఈ కాలనీలోకి వెళ్లడానికి రోడ్లు, కాలువలు నిర్మించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ టి జయరాంనకు వినతి పత్రం సమర్పించారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని కుక్కిడి గ్రామంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో వచ్చి సేవలను వినియోగించుకున్నారు. వైద్యులు డాక్టర్ బుద్దేశ్వర రావు, అభిలాష్ రోగులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ సాల్మన్ రాజు, డిప్యూటీ తహశీల్థార్ రాజేంద్ర, పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, సచివాలయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాలకొండ : ఇంటి ఇంటికీ వైద్యం అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్యోద్దేశమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. శనివారం మండలంలో తంపటాపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టారు. ప్రజలంతా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బొమ్మాళి భాను, వైస్ ఎంపిపిలు కనపాక సూర్య ప్రకాష్, వాకుముడి అనిల్, ఎంపిడిఒ ఉమామహేశ్వరి, డిప్యూటీ తహశీల్దార్ బుచ్చయ్య, చందక జగదీష్ ఉన్నారు.