
ధర్మవరం టౌన్ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. బుధవారం మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్లను పరిశీలించారు. ప్రత్యేక వైద్యులు, వైద్య బందం డాక్టర్లు పుష్పలత, దిలీప్‌కుమార్, వినోద్ కుమార్, పాల్ జివిఎన్‌లతో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైద్య బందం రోగులకు నాణ్యత కలిగిన వైద్యంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవలని సూచించారు. ఆప్తాలిక్ డాక్టర్ ఉరుకుందప్ప ఆధ్వర్యంలో 70 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో తిప్పేనాయక్, మెడికల్ స్పెషలాఫీసర్ చాంద్‌బాషా, డిఎంహెచ్‌ఒ ఎస్‌వి.కృష్ణారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సెల్వియా సాల్మన్, సిహెచ్‌ఒ కళావతి, ఈవోఆర్డీ మమతాదేవి, సీనియర్ అసిస్టెంట్ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.